Naari Naari Naduma Murari | చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ‘సంక్రాంతి విన్నర్’గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోస్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. వెన్నెల కిశోర్, సత్య, సునీల్, నరేష్‌ల కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగా, శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరిసి సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గౌతమ్ (శర్వానంద్) ఒక ఆర్కిటెక్ట్. తను పనిచేసే ఆఫీసులోనే నిత్య (సాక్షి వైద్య)తో ప్రేమలో పడతాడు. వీరిద్దరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న క్రమంలో, అదే ఆఫీసుకు టీమ్ లీడర్‌గా గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్) ఎంట్రీ ఇస్తుంది. అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గౌతమ్ జీవితం ఈ ఇద్దరు భామల మధ్య ఎలా నలిగిపోయింది? తన గతాన్ని ప్రస్తుత ప్రేయసికి ఎలా దాచాడు? చివరకు గౌతమ్ ఎవరిని చేరుకున్నాడు? అనే అంశాలను దర్శకుడు హిలేరియస్ కామెడీతో మలిచారు.
Inviting you to the union of love, lies and a lot of confusion 😳💍#NaariNaariNadumaMurariOnPrime, Feb 4@ImSharwanand @AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju @ItsActorNaresh @Composer_Vishal @dopyuvraj @gnanashekarvs @ramjowrites @brahmakadali @aj_sunkara… pic.twitter.com/WIfbcoHzTl
— prime video IN (@PrimeVideoIN) January 30, 2026