Bad Boy Karthik | యువ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చడంతో ఎలాగైన హిట్ కొట్టాలానే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలను ఓకే చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రామ్ దేశిన డైరెక్షన్లో నాగశౌర్య ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
అయితే నేడు నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యూత్‌ఫుల్, యాక్షన్ ఎంటర్టైనర్గా విభిన్నమైన కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. శౌర్య యాంగ్రీ లుక్‌లో కనిపించారు. ఇప్పటికే అరవైశాతం చిత్రీకరణ పూర్తయిందని, హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదని, నాగశౌర్య పాత్ర గతంలో చూడని విధంగా పవర్‌ఫుల్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
After a long gap, Naga Shaurya has signed a new film. He is #BadBoyKarthik in his next. pic.twitter.com/LQNG3lBl8s
— Jalapathy Gudelli (@JalapathyG) January 22, 2025