బంధాన్ని నిలబెట్టేది నమ్మకమే
‘కొత్త బంగారులోకం’ జంట వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్'. స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వంలో శివ కంఠంనేని నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రిమింగ్ అవుతున్నది.
‘కొత్త బంగారులోకం’ జంట వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వంలో శివ కంఠంనేని నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రిమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీమియర్, ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, అగ్ర దర్శకుడు హరీశ్‌శంకర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘నమ్మకమే బంధాన్ని నిలబెడుతుంది అనే విషయాన్ని తెలియజెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. శ్వేతాబసుతో ఇన్నేళ్ల తర్వాత కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అని వరుణ్‌సందేశ్ అన్నారు. ఈ సినిమాను గ్రేట్ కంబ్యాక్‌గా ఫీలవుతున్నానని, ఇన్నేళ్ల తర్వాత టాలీవుడ్‌కి తిరిగి రావడం నా సొంత ఇంటికొచ్చిన ఫీల్ కలిగిస్తున్నదని శ్వేతాబసు ప్రసాద్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

