కథ విన్నప్పుడే హిట్ అని చెప్పారు
‘ఈ సినిమా ఫలితంతో చాలా ఆనందంగా ఉన్నా. సంక్రాంతికి హిట్ కొట్టాలనే సంకల్పంతో టీమ్ అందరూ కష్టపడ్డారు. మా అంచనాలను నిజం చేస్తూ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అన్నారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా సామిరంగ’ చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
‘ఈ సినిమా ఫలితంతో చాలా ఆనందంగా ఉన్నా. సంక్రాంతికి హిట్ కొట్టాలనే సంకల్పంతో టీమ్ అందరూ కష్టపడ్డారు. మా అంచనాలను నిజం చేస్తూ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అన్నారు అగ్ర నటుడు నాగార్జున. ఆయన కథానాయకుడిగా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన ‘నా సామిరంగ’ చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. అల్లరి నరేష్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలను పోషించారు. ఆదివారం సాయంత్రం థాంక్స్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమాకు కీరవాణి సంగీతం ప్రధానాకర్షణగా నిలిచింది.
కొత్త దర్శకుడు విజయ్ బిన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత శ్రీనివాస చిట్టూరి కథ విన్నప్పుడే హిట్ పక్కా అన్నారు. ఈ రోజు ఆయన మాటలు నిజమయ్యాయి. కథలోని ఎమోషన్స్, కామెడీ, ఫ్రెండ్షిప్ అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి’ అన్నారు.
ఈ సినిమాలో వింటేజ్ నాగార్జునను చూసి ఆయన అభిమానులు సంబురపడుతున్నారని, తన ఫేవరేట్ యాక్టర్ నాగార్జునతో కలిసి కెరీర్లో గుర్తుండిపోయే పాత్రను చేశానని అల్లరి నరేష్ అన్నారు. అభిమానులకు మాటిచ్చిన విధంగానే సినిమాలో వింటేజ్ నాగార్జునను చూపించానని దర్శకుడు విజయ్ బిన్ని తెలిపారు. విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాత శ్రీనివాస చిట్టూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

