ఆముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా..నీ ప్రేమకథ’. కారుణ్య చౌదరి కథానాయిక. ప్రోత్నాక్ శ్రవణ్‌కుమార్ నిర్మాత. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ట్రైలర్ బాగుంది. హీరోగా, దర్శకునిగా శ్రీనివాస్ మంచి ప్రతిభను కనబరిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమా భారీ విజయం సాధించి అందరికి మంచి పేరును తీసుకురావాలి’ అన్నారు.