Muthiah Muralidaran | మళ్లీ తెరపైకి ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. రేపే ఫస్ట్ లుక్..!
Muthiah Muralidaran | శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran) జీవిత కథ ఆధారంగా కొన్నాళ్ల క్రితం 800 (800) టైటిల్‌తో బయోపిక్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మురళీధరన్ పాత్రలో నటించేందుకు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి సైన్ చేశాడు. ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.
Muthiah Muralidaran | లెజెండరీ క్రికెట్ ప్లేయర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటాడు శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muthiah Muralidaran). ఈ స్టార్ క్రికెటర్ జీవిత కథ ఆధారంగా కొన్నాళ్ల క్రితం 800 (800) టైటిల్‌తో బయోపిక్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మురళీధరన్ పాత్రలో నటించేందుకు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి సైన్ చేశాడు. ఈ బయోపిక్ ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. మురళీధరన్ గెటప్ కోసం అప్పట్లో మేకోవర్ కూడా మార్చుకుని. ట్రాన్స్ఫార్మేషన్ కూడా అయ్యాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi).
అయితే ఎల్టీటీఈతో సివిల్ వార్ సమయంలో అప్పటి శ్రీలంక ప్రధాన మంత్రి రాజపక్సకు ముత్తయ్య మురళీధరన్ మద్దతు పలికాడని తమిళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బయోపిక్ నుంచి తప్పుకోవాలని విజయ్ సేతుపతికి మురళీధరన్ ఓ లేఖ కూడా రాశాడు. తన వల్ల ఏ నటుడూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మురళీధరన్ లేఖ రాయగా.. ఆయన కోరిక మేరకు విజయ్ సేతుపతి సినిమా నుంచి వైదొలిగాడు. అయితే చాలా కాలానికి మళ్లీ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ న్యూస్ తెరపైకి వచ్చింది.
తాజాగా 800 మూవీ కొత్త అప్డేట్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం 8:00 గంటలకు లాంఛ్ కానున్నట్టు సమాచారం. బ్రిటీష్ యాక్టర్ దేవ్ పటేల్ ఈ చిత్రంలో మురళీధరన్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రేపు క్లారిటీ రానుంది. కెరీర్లో 800 టెస్ట్ వికెట్స్ తీసిన ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్ బౌలర్‌గా అరుదైన రికార్డు మురళీధరన్ ఖాతాలో ఉంది. ఈ రికార్డు స్ఫూర్తితోనే సినిమాకు 800 టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
Read Also :
SAINDHAV | సైంధవ్ క్రేజీ న్యూస్.. సిల్వర్ స్క్రీన్‌పై వెంకటేశ్-నాని కాంబినేషన్
Mano | మల్టీ టాలెంటెడ్ సింగర్ మనోకు అరుదైన గౌరవం
Hombale Films | హోంబలే ఫిలిమ్స్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

