Adipurush Movie Latest Update | ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్ ప్రస్తుతం ఏ సినీ అభిమానిని కదిలించిన ఇదే నామం జపం చేస్తున్నారు. దాదాపుగా నెలన్నర రోజులుగా సరైన సినిమాలేక థియేటర్లు బోసి పోతున్నాయి. చాలా మంది సినీ లవర్స్ సైతం పెద్ద సినిమాల్లేక థియేటర్ల వైపు కూడా చూడటం లేదు. ఇక ప్రస్తుతం అందరి చూపు ఆదిపురుష్ పైనే ఉంది. దానికి తోడు రెండు పాటలు, ట్రైలర్ సినిమాపై తిరుగులేని హైప్ తీసుకొచ్చాయి. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సరిగ్గా పదమూడు రోజుల్లో విడుదల కానుంది. శ్రీవారి పాదల కింద తిరుపతిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక జూన్ 6న జరుగునుంది. ఇప్పటికే ఆ వేడుకకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఇక ఇదిలా ఉంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ సినిమాకు పనిచేసిన సంగీత ద్వయంలో ఒకరైన అతుల్ ముంబై నుంచి తిరుపతికి బైక్ యాత్ర చేస్తున్నాడు. పన్నెండొందలకు పైగా కిలో మీటర్ల దూరంలో ఉన్న తిరుపతికి బైక్ పైన వెళ్లడమంటే ఆశా మాశీ కాదు. ఇలా అతుల్ సినిమాపై తనుకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. మూడున బయల్దేరి ఆరున జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అజయ్ తో కలిసి జై శ్రీరామ్ పాటకు లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. ఇది విన్న ప్రతీ ఒక్కరు షాక్ అవుతున్నారు. ఎంత సినిమాపై అభిమానున్న ఇలాంటి రిస్క్ చేస్తున్నాడంటే అందిరికీ ఆశ్చర్యం కలుగుతుంది.
మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పటికే సినిమాపై తిరుగులేని హైప్ వచ్చింది. ఆ హైప్ ను మరింత రెట్టింపు చేసుందుకు చిత్రబృందం జూన్ 6న మరో ట్రైలర్ ను వదలనున్నారు. ఈ సారి మొత్తం యుద్ద సన్నివేశాలతో ట్రైలర్ తో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందేంచేలా రెడీ చేస్తున్నారట. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతాయన్నిది ఇన్ సైడ్ టాక్.