Mumbai Diaries season 2 | 2021లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ముంబై డైరీస్ 26/11 (Mumbai Diaries 26/11) వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవంబర్ 26, 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ తొలి సీజన్ ప్రేక్షకులను కట్టి పడేసింది. కొంకణా సేన్ శర్మ, మోహిత్ రైనా, టీనా దేశాయ్ ప్రధాన పాత్రలు పోషించగా.. డి-డే, బాట్లా హౌస్ చిత్రాల ఫేమ్ నిఖిల్ అద్వానీ ఈ వెబ్ సిరీస్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ సీజన్ 2 వస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ సీజన్ 2కు సంబంధించి రీసెంట్గా ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సిరీస్ నుంచి మేకర్స్ టీజర్ వదిలారు.
టీజర్ గమనిస్తే.. మొదటీ సీజన్ 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఉండగా.. రెండో సీజన్ ముంబై వరదల నేపథ్యంలో రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సీజన్ 2 అక్టోబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
#MumbaiDiaries S2 coming soon on @PrimeVideoIN@mohituraina @konkonas @shreyadhan13 @Mrunmayeeee @natashabharadwa @satyajeet_dubey @tinadesai07 @BelawadiBlr @nikkhiladvani @monishaadvani @madhubhojwani @EmmayEntertain #SanyukthaChawlaShaikh @yash_chhetija @s_persis pic.twitter.com/8tITTP25NF
— Filmy Hype (@Filmy_Hype) September 25, 2023
ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తున్న ఈ సిరీస్‌ను మోనిషా అద్వానీ & మధు భోజ్వానీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సీజన్లో కొంకణా సేన్ శర్మ, మోహిత్ రైనాలతో పాటు శ్రేయా ధన్వంతరి, నటాషా భరద్వాజ్, సత్యజీత్ దూబే, మృణ్మయీ దేశ్‌పాండే, ప్రకాష్ బెలవాడి, పరంబ్రత ఛటోపాధ్యాయ, రిధి డోగ్రా, బాలాజీ గౌరీ, సోనాలి కులకర్ణి నటించనున్నారు.