MSG | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సక్సెస్ ఫుల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 4న తిరుపతిలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రన్‌టైమ్‌పై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ ట్రైలర్ మొత్తం 2 నిమిషాల 30 సెకన్లు ఉండనుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఎడిట్ రూమ్ నుంచి ఓ ఫోటోను షేర్ చేస్తూ వెల్లడించారు. దీంతో అభిమానుల్లో ట్రైలర్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
చిరంజీవిని పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసే పాత్రలో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే లీకైన అప్డేట్స్ ద్వారా తెలుస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్, ఎమోషన్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. ట్రైలర్లో చిరంజీవి టైమింగ్, డైలాగ్ డెలివరీ హైలైట్‌గా నిలవనున్నాయనే అంచనాలు ఉన్నాయి.షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం మరో పెద్ద ఆకర్షణగా మారింది. అలాగే కేథరీన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సంగీతానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చుతుండగా, ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సంక్రాంతి సీజన్లో విడుదల కానున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక జనవరి 4న విడుదల కానున్న ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి. చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ ఎంటర్టైనర్ మెగాస్టార్ ఫ్యాన్స్‌కు పండగ ట్రీట్‌గా నిలుస్తుందా లేదా అన్నది త్వరలో తేలనుంది.