ప్రభుదేవాతో గొడవ.. 15 ఏళ్ల తర్వాత క్లారిటీ ఇచ్చిన రాజు

శత్రువు సినిమాతో నిర్మాతగా మారిన ఎంఎస్ రాజు ఆ తర్వాత ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. అప్పట్లో ఆయన బేనర్లో సినిమా వస్తుందంటే తప్పక హిట్ అవుతుందనే నమ్మకం ఉండేది. అయితే నువ్వొస్తానంటే నేనొద్దంటానా తర్వాత ప్రభుదేవా- ఎంఎస్ రాజు కాంబినేషన్లో పౌర్ణమి అనే చిత్రం రూపొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి.
2006లో వచ్చిన పౌర్ణమి సమయంలో ఏర్పడ్డ గొడవల గురించి ఇంత వరకు క్లారిటీ లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఎంఎస్ రాజు. ప్రభుదేవాకు నాకు గొడవలు అయ్యాయని వచ్చిన వార్తలలో వాస్తవం లేదు. ప్రభుదేవా మంచి పొజీషన్లో ఉన్నందుకు సంతోషిస్తాను. అతనితో నాకు గొడవలు ఎందుకు ఉంటాయి. ఇవన్నీ పుకార్లు మాత్రమే అని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. దీంతో 15 ఏళ్లుగా ఉన్న రూమర్‌కి చెక్ పడింది. కాగా, గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న ఆయన తాజాగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ‘7 డేస్ 6 నైట్స్’ పేరుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- MS Raju
- pournami
- prabhudeva
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
Jailer 2 | రజనీకాంత్ ‘జైలర్ 2’ అరుదైన రికార్డు.. రూ.800 కోట్ల దిశగా పరుగులు, నాలుగు రాష్ట్రాల్లో సరికొత్త చరిత్ర!
YS Sharmila | యలహంక ఇంట్లో నా కుమార్తె పెళ్లి జరగట్లేదు.. వేరే చోట నిర్వహిస్తున్నాం: వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

