MS Dhoni | తనను సీఎస్కే జట్టులోకి తీసుకోండి అని కోరిన నటుడు.. ధోనీ రియాక్షన్ ఏంటంటే..?
MS Dhoni | టీంఇండియా (Team India) మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (Lets Get Married) అనే తమిళ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
MS Dhoni | టీంఇండియా (Team India) మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (Lets Get Married) అనే తమిళ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం చెన్నై (Cehnnai)లో ఘనంగా జరిగింది. లీలా ప్యాలెస్ లో జరిగిన ఈ ఈవెంట్ లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఎల్ జీఎం (LGM) చిత్రంలో కీలక పాత్ర పోషించిన తమిళ స్టార్ నటుడు యోగి బాబు (Tamil Actor Yogi Babu) మాట్లాడుతూ.. తనను చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టులోకి తీసుకోవాలంటూ దోనీని అడిగారు. దీనికి ధోనీ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘అంబటి రాయుడు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఆ ప్లేస్ లోకి తప్పకుండా మిమ్మల్నే తీసుకుంటాను. ఈ విషయంపై జట్టు యాజమాన్యంతో మాట్లాడతాను. అయితే, మీరు నిలకడగా ఆడాల్సి ఉంటుంది. మీరేమో సినిమాలతో బిజీగా ఉంటారు. ముందే చెబుతున్నా. వాళ్లు మిమ్మల్ని గాయపరచాలని మాత్రమే బౌలింగ్ వేస్తారు’ అంటూ నవ్వులు పూయించారు.
ధోనీ సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి హోం బ్యానర్ ధోనీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ (Dhoni Entertainment banner) ను షురూ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఎల్జీఎం (Lets Get Married). ఈ చిత్రంలో లవ్‌టుడే ఫేం ఇవానా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రమేశ్ తమిళ్మని (Ramesh Thamilmani) దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Dhoni & Sakshi at the LGM Trailer Launch.
A lovely picture. pic.twitter.com/NrhejEOUIg
— Johns. (@CricCrazyJohns) July 10, 2023
Also Read..
Dhanush | మద్రాస్ హైకోర్టులో నటుడు ధనుష్, ఐశ్వర్యలకు ఊరట..
Uttarakhand | బండరాళ్లు పడి వాహనాలు ధ్వంసం.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

