Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 (Nani 30)గా వస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేసింది నాని టీం.
ప్రమోషన్స్ లో భాగంగా నాని, మృణాళ్ ఠాకూర్ ఫన్నీ చిట్‌చాట్‌కు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు మేకర్స్. నీ ఫేవరేట్ క్వశ్చన్..ఏజ్ (వయస్సు) అని నాని అడుగుతుంటే.. గత నెలే 16వ బర్త్ డే జరుపుకున్నానంటోంది మృణాళ్. అంతేకాదు హాయ్ నాన్నలో హీరోహీరోయిన్లు పెండ్లి చేసుకుంటారా..? సినిమాలో విషాదకర ముగింపు ఉంటుందా..? ఎన్ని పాటలుండబోతున్నాయి..? మూవీలో నానిని మృణాళ్ ఠాకూర్ నాన్న అని ఎందుకు పిలుస్తుంది..? ఇందులో నాని పాత్ర పేరేంటి..? లాంటి ప్రశ్నలు కూడా చిట్‌చాట్ లో ఉండబోతున్నాయని ప్రోమోతో చెప్పేశారు మేకర్స్. మరి ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఫుల్ వీడియో రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.
ఈ చిత్రంలో నాని కూతురు పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..