Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Mrunal Takhur | సినీ తారల వ్యక్తిగత జీవితాలు, దుస్తులు, రూపురేఖలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా హీరోయిన్లు ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్, ఆన్లైన్ ట్రోలింగ్‌పై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కూడా ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు. కత్రినా కైఫ్, కృతి సనన్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విమర్శలను తప్పుబడుతూ, ఇతరుల వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని హితవు పలికారు.
Mrunal Takhur | సినీ తారల వ్యక్తిగత జీవితాలు, దుస్తులు, రూపురేఖలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా హీరోయిన్లు ఎదుర్కొంటున్న బాడీ షేమింగ్, ఆన్లైన్ ట్రోలింగ్‌పై పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ కూడా ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు. కత్రినా కైఫ్, కృతి సనన్‌లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విమర్శలను తప్పుబడుతూ, ఇతరుల వ్యక్తిగత ఎంపికలను గౌరవించాలని హితవు పలికారు.తన తాజా చిత్రం ‘పూజా మేరీ జాన్’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ ఆన్లైన్ ట్రోలింగ్ గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ తమ జీవితాన్ని తమకు నచ్చిన విధంగా గడిపే హక్కు ఉంటుందని, ఇతరుల వ్యక్తిగత నిర్ణయాలను విమర్శించే అధికారం ఎవరికీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
కత్రినా కైఫ్, కృతి సనన్ వంటి నటీమణులు సినిమా రంగానికి ఎంతో సేవ చేశారని, అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. వారి విజయాలను, కష్టాన్ని మరిచిపోయి చిన్న చిన్న విషయాలపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ప్రతి అంశంలోనూ ఇతరులను తప్పుపట్టడం మానుకోవాలని, సోషల్ మీడియాలో కొందరి ప్రవర్తన చూస్తుంటే జనాలకు పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటీవల కత్రినా కైఫ్ ఓ వేడుకలో పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో ఆమె శారీరక రూపురేఖలపై కొందరు నెటిజన్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తల్లి అయిన తర్వాత శరీరంలో సహజంగా వచ్చే మార్పులను కూడా కొందరు విమర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఒక మహిళ శరీరంలో వచ్చే మార్పుల ఆధారంగా ఆమెను అంచనా వేయడం, బహిరంగంగా అవమానించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చాయి. మరోవైపు, నటి కృతి సనన్ కూడా ఓ ప్రకటనలో ధరించిన దుస్తుల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా విడుదలైన ఓ నగల ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ దుస్తులు పండుగ సందర్భానికి తగినవి కావంటూ విమర్శలు రావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ వివాదం నేపథ్యంలో సదరు ప్రకటనను తొలగించారు.. తన ఉద్దేశం ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కాదని కృతి సనన్ వివరణ ఇచ్చింది. కాగా, సామాజిక మాధ్యమాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారని మృణాల్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. అయితే మహిళల దుస్తులు, శరీరాకృతి, వ్యక్తిగత నిర్ణయాలపై తరచూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

