Mr Bachchan Movie | మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ‘నామ్ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. షాక్, మిరపకాయ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా రావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ అందుకోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది ఈ చిత్రం.
ఇదిలావుంటే ఈ సినిమా విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
#MrBachchan is coming to Netflix on 12 September !! #MrBachchanOnNetflix pic.twitter.com/rLp72Hp0Y1
— Suresh PRO (@SureshPRO_) September 7, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బచ్చన్ (రవితేజ) నిజాయితీ గల ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్. ఆ నిజాయితీ వల్లే అతను సస్పెండ్ అయ్యాడు. తన సొంతూరెళ్లిపోయి కుమార్సానూ ఆర్కెస్ట్రా నడుపుకుంటూ తల్లిదండ్రులతో, స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. అక్కడే అతనికి జిక్కీ(భ్యాగ్యశ్రీ బోర్సే) పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇదిలావుంటే.. పేరుమోసిన దుర్మార్గుడు, ఆ ప్రాంత ఎంపీ అయిన జగ్గయ్య(జగపతిబాబు) తమ్ముడి రాజకీయ అరంగేట్రం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కరెంట్ కోసమని జగ్గయ్య మనుషులు బచ్చన్ ఇంటిపై పడతారు. అడ్డుకున్న బచ్చన్ తల్లిదండ్రులను గాయపరుస్తారు. విషయం తెలుసుకున్న బచ్చన్.. ఆ బహిరంగ సభ సాక్షిగానే ఆ తప్పుకు కారకుడైన జగ్గయ్య తమ్ముడితో తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పించాడు. ఇంతలో బచ్చన్‌కీ, జిక్కీకి పెళ్లి ఖాయం అయింది. మరోవైపు వైపు తన తమ్ముడికి జరిగిన అవమానం తెలిసి జగ్గయ్య రగిలిపోతుంటాడు. ఇంకోవైపు బచ్చన్‌కి మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావల్సిందని పై అధికారుల నుంచి ఫోన్ వస్తుంది. జగ్గయ్య మనుషులు బచ్చన్ కోసం వెతుకుతున్నారు. బచ్చన్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జగ్గయ్య ఇంటిపై ఐటీ రైడ్ నిర్వహించాలనే బాధ్యత తొలి అసైన్మెంట్గా పడింది. తన టీమ్‌తో జగ్గయ్య ఇంటిపై సోదాకు వెళతాడు బచ్చన్. వెతకుతున్న బచ్చన్ ఐటీ అధికారిగా తన ఇంటిపైకే ఐటీ దాడి జరపడానికి రావడంతో జగ్గయ్య ఖంగుతుంటాడు. మరి జగ్గయ్య ఇంటిని బచ్చన్ దిగ్విజయంగా రైడ్ చేశాడా? ఆ రైడ్ ఆపడానికి జగ్గయ్య చేసిన ప్రయత్నాలేంటి? చివరికి బచ్చన్ ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.