సినిమా పేరు ‘ఐ హేట్ మ్యారేజ్’. సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్నారు. పరమేశ్ రేణుకుంట్ల దర్శకుడు. ఎం.దయానంద్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాసరాజు క్లాప్ ఇవ్వగా, అగ్ర దర్శకుడు సుకుమార్ అన్నయ్య, రచయిత, నిర్మాత విజయ్‌కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. చిత్ర సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి గౌరవ దర్శకత్వం వహించారు. భావోద్వేగాలతో కూడిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటైర్టెనర్ ఇదని దర్శకుడు చెప్పారు. నేటి నుంచి ఏకధాటిగా డిసెంబర్ వరకూ జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని, కాన్సెప్ట్‌ని నమ్మి చేస్తున్న సినిమా ఇదని నిర్మాత తెలిపారు. పృథ్వీ, ఆశ్రిత, లోహిత్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్.