Mosagallaku Mosagadu | మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ పరిస్థితి ఏంటి.. ఏమైనా వర్కౌట్ అయిందా..?
Mosagallaku Mosagadu | ఈ మధ్య సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా 4k వర్షన్ కూడా విడుదలైంది. ఇప్పటివరకు ఈ జనరేషన్ హీరోల సినిమాలు మాత్రమే మళ్లీ విడుదలయ్యాయి.. కానీ 70 ల్లో వచ్చిన సినిమాలు రాలేదు. ఈ లిస్టులో సూపర్ స్టార్ కృష్ణ ముందున్నాడు.
Mosagallaku Mosagadu | తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తుంది. పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. దీని వల్ల వాళ్లకు అయ్యే ఖర్చు తక్కువ వచ్చే లాభాలు ఎక్కువ. అందుకోసమే ఈ మధ్య ఎక్కువగా పాత సినిమాలను మళ్లీ విడుదల చేసే ట్రెండ్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా 4k వర్షన్ కూడా విడుదలైంది. ఇప్పటివరకు ఈ జనరేషన్ హీరోల సినిమాలు మాత్రమే మళ్లీ విడుదలయ్యాయి.. కానీ 70 ల్లో వచ్చిన సినిమాలు రాలేదు. ఈ లిస్టులో సూపర్ స్టార్ కృష్ణ ముందున్నాడు.
మొన్న మే 31న ఆయన జయంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను రిమాస్టర్ చేసి విడుదల చేశాడు ఆయన తమ్ముడు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు. పైగా ఆ సినిమాతో పాటే మహేశ్ బాబు గుంటూరు కారం టీజర్ విడుదల చేశారు. దాంతో థియేటర్స్ లో సూపర్ స్టార్ అభిమానులు ఓ రేంజ్లో పండగ చేసుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మోసగాళ్లకు మోసగాడు సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయి అనేది ఘట్టమనేని అభిమానుల్లో కూడా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు నేటి జనరేషన్ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ అయితే రాలేదు. కానీ 50 ఏళ్ల నాటి సినిమాను మళ్లీ విడుదల చేసినా కూడా మొదటి రోజు చాలా థియేటర్స్లో హౌస్ ఫుల్ అయ్యాయి. దాన్ని బట్టి కృష్ణ రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది.
ఆనాటి హీరోల సినిమాల లెక్కల పరంగా చూస్తే మాత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినట్టే. దీన్ని రిమాస్టర్ చేసే విడుదల చేయడానికి 20 లక్షల ఖర్చు అయిందని చెప్పాడు ఆదిశేషగిరిరావు. కచ్చితంగా మొదటి రోజే ఆ డబ్బులు వెనక్కి రావడమే కాదు.. లాభాలు కూడా వచ్చాయి. మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు 70% కు పైగానే ఆక్యుపెన్సీ కనిపించింది. దీన్నిబట్టి కచ్చితంగా 50 లక్షల పైగానే గ్రాస్ వసూలు చేసింది మోసగాళ్లకు మోసగాడు. త్వరలోనే కృష్ణ నటించిన సింహాసనం సినిమాను కూడా 8Kలో విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజానికి కృష్ణ బతికున్నప్పుడే ఈ ఆలోచన చేశాడు. తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో సరికొత్త మార్గాలు చూపించిన ఈయన.. 8k వర్షన్ కూడా పరిచయం చేయాలనుకున్నాడు. దానికోసం తన సింహాసనం సినిమాను ఎంచుకున్నాడు. అయితే అది జరిగే లోపే అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు సూపర్ స్టార్. ఆయన లేకపోయినా ఆయన కోరిక తీర్చడానికి కొడుకు మహేశ్తో పాటు తమ్ముడు ఆదిశేషగిరిరావు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న సింహాసనం సినిమా రీ రిలీజ్ కానుంది.
Read More :
Varun Tej | రేపే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్.. వైరల్గా మారిన మెగా ఫ్యాన్ పోస్ట్
Anupama Parameswaran | అనుపమ సూపర్ హాట్ షో.. రూట్ మార్చేసిన కేరళ కుట్టి.. ఈసారైనా కలిసొచ్చేనా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

