Kaduva Movie Postponed | మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ పేరు ఈ మధ్య బాగా వినబడుతుంది. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో పలు విభాగాల్లో పనిచేస్తూ మాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఈయన నటించిన సినిమాలు విడుదల కాకపోయినా ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యాడు. ఇటీవలే ఈయన నటించిన ‘జన గణ మణ’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాగా.. దేశ వ్యాప్తంగా విశేష స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం ఈయన నటించిన ‘కడువ’ విడుదలకు సిద్ధంగా ఉంది. షాజీ కైలాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని వారం రోజులు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతికూల పరిస్థుతుల వల్ల ఈ సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు అభిమానులు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు క్షమించాలని కోరారు. అంతేకాకుండా ప్రమోషన్స్‌ని యథాతథంగా కొనసాగిస్తామని వెల్లడించారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంతో వివేక్ ఓబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌తో కలిసి పృథ్విరాజ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.