మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ ‘హృదయం’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘డియాస్ ఇరాయ్’. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ర్టాల్లో శ్రీస్రవంతి మూవీస్ విడుదల చేస్తున్నది. ఈ చిత్రానికి రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు.
ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని శ్రీస్రవంతి మూవీస్ అధినేత రవికిషోర్ తెలిపారు. సుస్మితాభట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్ తదితరులు ఈ చిత్ర తారాగణం. క్రిష్టో జేవియర్ సంగీతాన్నందించారు.