Mohanlal | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న అతి కొద్దిమంది స్టార్ యాక్టర్లలో మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohanlal) ఒకరు. మోహన్‌లాల్ స్వీయదర్శకత్వంలో వస్తోన్న చిత్రం BARROZ. ఇప్పటికే కనకపు సింహాసనంపై, అశ్వంపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తూ.. సినిమాపై సూపర్ హైప్ పెంచేస్తున్నాడు.
బరోజ్ ఫస్ట్ స్క్రీనింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మోహన్‌లాల్, డీవోపీ అండ్ టీం బరోజ్ స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరు కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. బరోజ్ ట్రైలర్ కూడా సిద్దం కాగా.. త్వరలోనే లాంచ్ డేట్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. Jijo Punnoose కథనందిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కిస్తున్నారు.
మోహన్ లాల్ వీటితోపాటు లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban 2) లో నటిస్తున్నాడు. L2: Empuraan, రామ్, వృషభ చిత్రాల్లో నటిస్తున్నాడు. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Actor – Director & DOP are ready for #Barroz 3D first screening.#Mohanlal @santoshsivan pic.twitter.com/JpiCeZOKSJ
— AB George (@AbGeorge_) October 1, 2024
NTR Neel | ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కథ ఇదే.. హీరోయిన్ కూడా ఫైనల్.. !
Matka | సూపర్ స్టైలిష్‌గా వరుణ్ తేజ్.. మట్కా రిలీజ్ అనౌన్స్మెంట్ లుక్ వైరల్
Hari Hara Veera Mallu | హరి హర వీరమల్లుతో ఇస్మార్ట్ భామ.. విజయవాడలో నిధి అగర్వాల్ ల్యాండింగ్