Jailer Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్టు చూసి చాలా కాలం అయింది. నిజానికి ‘రోబో’ తర్వాత ఇప్పటి వరకు రజనీకు ఆ స్థాయిలో హిట్టు పడలేదు. మధ్యలో ‘కబాలీ’, ‘పేట’, ‘2.o’ వంటి సినిమాలకు కమర్షియల్‌గా సేఫ్ అయినా.. రజనీ రేంజ్ హిట్ సాధింలేకపోయాయి. ప్రస్తుతం ‘రజనీ’ ఆశలన్ని జైలర్ సినిమాపైనే ఉన్నాయి. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈయనపై షూటింగ్ జరుపనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. కన్నడ హీరో శివరాజ్‌కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.