Neru Trailer | మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం నెరు(Neru). ప్రియమణి (Priyamani) కీలక పాత్రలో నటిస్తుంది. దృశ్యం(Drushyam), దృశ్యం 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన జీతూ జోసెఫ్ (Jeethu Joseph) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇక ఈ ట్రైలర్ చూస్తే.. మోహన్‌లాల్ ఇందులో విజయ్ మోహన్ అనే న్యాయవాది పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. చాలా రోజులుగా కేసులు వాదించని ఒక లాయర్ సడన్‌గా ఒక కేసు కోసం మళ్లీ కోర్టు మెట్లు ఎక్కుతాడు. ఆ తరువాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ చిత్రం కోర్టు రూం డ్రామా నేపథ్యంలో సాగనుంది.
ఇక దృశ్యం సిరీస్‌లతో మోహన్‌లాల్‌కు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా సలార్, డంకీలకు పోటిగా డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.