సంతోష్ కల్వచర్ల, శ్రేయాసి సేన్ జంటగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ ‘మొహబ్బత్’. మ్యాక్ దర్శకత్వంలో అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి శాసనసభ్యుడు నవీన్ యాదవ్ క్లాప్‌నివ్వగా, చిత్రనిర్మాత అఫ్రోజ్ షేక్ కెమెరా స్విచాన్ చేశారు. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని లాంచ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఎమోషనల్ యూత్‌ఫుల్ జెన్‌జీ సినిమా ఇదని దర్శకుడు మ్యాక్ తెలిపారు. నిర్మాతగా తన తొలి ప్రయత్నం తప్పక సఫలం అవుతుందనే నమ్మకాన్ని నిర్మాత అఫ్రోజ్ షేక్ వ్యక్తం చేశారు. ఇంకా హీరోహీరోయిన్లతో పాటు రచయిత కలాం కూడా మాట్లాడారు. అజయ్ ఘోష్, సాత్విక్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వైఎస్ కృష్ణ, సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాణం: ఏబీఎస్ ప్రొడక్షన్స్.