మీర్జాపూర్ సీజన్-3
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
నటీనటులు: పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి, ఇషా తల్వార్, విజయ్ వర్మ
దర్శకత్వం: గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్
క్రైమ్, యాక్షన్, రొమాంటిక్, వయొలెన్స్ కలగలుపుగా తెరకెక్కిన మీర్జాపూర్ వెబ్‌సిరీస్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు వెబ్‌సిరీస్ నిర్వచనాన్నే మార్చేశాయి. కథ, కథనాల పరంగా మూడోసీజన్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. పదవి, అధికారం అనేవి తలకెక్కితే ప్రాణాలు కోల్పోవడానికైనా రెడీ అవుతారు. కానీ అధికారాన్ని వదులుకునేందుకు ఇష్టపడరన్న కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్నది మీర్జాపూర్ థర్డ్ సీజన్.
మొదటి రెండు సీజన్లకు కొనసాగింపుగా మూడో సీజన్ మొదలవుతుంది. గుడ్డు (అలీ ఫజల్), గోలు (శ్వేత త్రిపాఠి) చేసిన దాడిలో మున్నా (దివ్యేందు) చనిపోగా.. కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) తీవ్రంగా గాయపడి అదృశ్యమవుతాడు. దీంతో మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకునే క్రమంలో.. పూర్వాంచల్‌లో ప్రతీ దాన్ని శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు గుడ్డు. కాలీన్ గుర్తులు లేకుండా చెరిపేసేందుకు ప్రయత్నిస్తాడు. మున్నా మరణంతో మాధురి యాదవ్ (ఇషా తల్వార్) రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అవుతుంది. కనిపించకుండా పోయిన కాలీన్ భయ్యాపై సింపథీ క్రియేట్ చేసి, ప్రజలకు చేరువ కావాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు గుడ్డూ దాడిలో గాయపడిన కాలీన్ను శరద్ శుక్లా (అంజుమ్ శర్మ) కాపాడి, అతడి సహాయంతో మీర్జాపూర్ కుర్చీని దక్కించుకోవాలనుకుంటాడు. వీరిలో ఎవరు మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకుంటారు అనేది సిరీస్ కథ.
మొదటి రెండు సీజన్ల మాదిరిగా మూడో సీజన్ ఉత్కంఠ రేకెత్తించలేదని చెప్పాలి. రెండు సీజన్లలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్లోని వాడివేడి మూడో సీజన్లో లేవు. పవర్‌ఫుల్‌గా కనిపించే కాలీన్ భయ్యాను ఈ సీజన్లో మంచానికే పరిమితం చేయడం మైనస్ అయింది. ఎనిమిదో ఎపిసోడ్ నుంచి మొదలయ్యే అసలు కథతో సిరీస్ వేగం పుంజుకుంటుంది. చివరి ఎపిసోడ్ సిరీస్ మొత్తానికి కీలకం. ైక్లెమాక్స్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చి నాలుగో సీజన్‌పై ఆసక్తి పెంచారు దర్శకుడు.