Mirzapur The Film | మీర్జాపూర్ మళ్లీ వచ్చేస్తుంది.. కానీ ఈ సారి మాత్రం థియేటర్లలో..!
Mirzapur The Film | పవర్ ఫుల్ క్యారెక్టర్లతో సాగే మూడు సీజన్లకు ప్రేక్షకుల వద్ద నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. కాగా ఈ యూనివర్స్‌ను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో వస్తున్నారు.
Mirzapur The Film | యాక్షన్ క్రైం థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ప్రాంచైజీ సిరీస్ మీర్జాపూర్ (Mirzapur).ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు సీజన్లు సందడి చేశాయి. పవర్ ఫుల్ క్యారెక్టర్లతో సాగే మూడు సీజన్లకు ప్రేక్షకుల వద్ద నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. కాగా ఈ యూనివర్స్‌ను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ సరికొత్త ప్లాన్‌తో వస్తున్నారు. మీర్జాపూర్ ఇక ఫీచర్ ఫిల్మ్‌గా రానుంది.
Mirzapur: The Film టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా కథను థియేటర్లలో అద్శుతమైన థ్రియాట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా డిజైన్ చేశారని ఇన్సైడ్ టాక్. మీర్జాపూర్ ది ఫిల్మ్ అధికారికంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని తెలియజేశారు. క్రైం సాగాను బిగ్ స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్లు పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి పునీత్ కృష్ణ కథనందిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్నారు. విడుదలకు సంబంధించిన వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటించారు. మరి సిల్వర్ స్క్రీన్‌పై ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
It’s a wrap! #MirzapurTheFilm
Video courtesy: Tushil Pujari pic.twitter.com/ZFOGrUXQHE— Excel Entertainment (@excelmovies) February 1, 2026
Read Also :
Bandla Ganesh | ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’లో బండ్ల గణేష్ ‘పాయా పాయా’ సందడి.. హుక్ స్టెప్ అదుర్స్
Shambala | ఓటీటీలో ‘శంబాల’ సంచలనం.. 11 రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల రికార్డు
Varun Tej | వరుణ్ తేజ్ కెరీర్‌కు కీలక మలుపు .. అట్లీ కాంబో వార్తలతో పెరిగిన హైప్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

