‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మిరల్’. ఎం.శక్తివేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీ.హెచ్.సతీష్ కుమార్ నిర్మించారు. వాణి భోజన్ కథానాయిక. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశమిది. ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అందులో చూపించిన ఓ వింత మాస్క్ వెనకున్న కథమేమిటన్నది ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నది.
ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేసే చిత్రమిది. హారర్ థ్రిల్లర్స్‌లో సరికొత్త పంథాలో తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సురేష్ బాలా, సంగీతం: ప్రసాద్ ఎస్ఎన్, నిర్మాణ సంస్థలు: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, దర్శకత్వం: ఎం.శక్తివేల్.