Mira Rajput | ప్రకృతి ఒడిలో రాజ్ పుత్ సోయగం పుట్టినరోజు
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) భార్య మీరా రాజ్పుత్ బుధవారం 27వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ భామ ఈ పుట్టినరోజు వేడుకను చాలా ప్రత్యేకంగా జరుపుకుంది.

తన అందంతో నెటిజన్ల మనసు దోచేస్తుంటుంది రాజ్ పుత్ సుందరి మీరా రాజ్పుత్ (Mira Rajput). బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) భార్య మీరా రాజ్పుత్ బుధవారం 27వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ భామ ఈ పుట్టినరోజు వేడుకను చాలా ప్రత్యేకంగా జరుపుకుంది. ముంబైలో ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో పిక్నిక్ టూర్ వేసుకుంది మీరారాజ్ పుత్. హిల్స్ ప్రాంతాల్లో ఆకుపచ్చని అందాల మధ్యలో పిక్నిక్ (picnic)కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేసింది.
పొడవాటి చెవి పోగులతో డెనిమ్ జీన్స్, స్వెటర్ లో శాలువా కప్పుకుని గ్రీనరీలో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు పిక్నిక్ బాస్కెట్ స్టిల్స్ ను పంచుకుంది. పిక్నిక్ కు వెళ్లిన ప్రదేశంలో వివిధ రకాల పూల మొక్కల స్టిల్స్ ను పోస్ట్ చేసింది. హృదయం, బెలూన్ ఎమోజీలను ఫొటోలకు క్యాప్షన్ గా పెట్టింది. ప్రకృతిలో మమేకమై మీరా రాజ్ పుత్ సాదాసీదాగా జరుపుకున్న పుట్టినరోజు ఫొటోలు ఆన్ లైన్ లో హల్ చేస్తున్నాయి. షాహిద్ కపూర్ పిక్నిక్ టైంలో గ్రీనరీలో మీరారాజ్పుత్ ను హగ్ చేసుకుని చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ను పోస్ట్ చేయగా..వైరల్ అవుతోంది.
తన ప్రియమైన భార్యకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు షాహిద్ కపూర్. నీ సంతోషాన్ని పంచుకోవడానికి మాత్రమే కాదు, నీ బాధను పంచుకోవడానికి కూడా. ప్రతిరోజూ ఒకరి చేతుల్లో ఒకరు నవ్వడం మాత్రమే కాదు, ఒకరినొకరు చేతుల్లో ఏడ్చుకునే రోజుల్లో కూడా. నువ్వు నా ప్రపంచానికి మూలం. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తన సందేశాన్ని పంచుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

