Minister Talasani | సినీ కార్మికులకు అండగా ఉంటాం : మంత్రి తలసాని
Minister Talasani | సినీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా (Government Support) ఉంటుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ : సినీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా (Government Support) ఉంటుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) భరోసా ఇచ్చారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి సారధ్యంలోని బృందం సినీ కార్మికుల(Cine Workers) సమస్యల పై మంత్రి తలసానిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు .
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కార్మికులకు చిత్రపురికాలనీ(Chitrapuri colony)లో నివాస గృహాలు దక్కలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు వివరించారు. నేటికి ఎంతోమంది సినీ కార్మికులకు సరైనా ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, పేద కార్మికులకు ఇండ్ల స్థలాలు(House sites) మంజూరు చేయాలని కోరారు. తెలంగాణ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షురాలు కవితా ఝాన్సీ మాట్లాడుతూ తెలంగాణ యూనియన్లలో ఉన్నటువంటి సభ్యులకు పనులు లభించడం లేదని, తెలంగాణ కార్మిక సంఘాల సభ్యత్వాలు(Member ship) చెల్లవని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు.
సినిమాల్లో వచ్చిన అవకాశాలను కూడా పోగొడుతున్నారని వాపోయారు. తెలంగాణ కార్మికులను మనోవ్యధకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ తెలంగాణ సినీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మూర్తి, ట్రెజరర్ ఠాగూర్,కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

