Miheeka Bajaj | రానా భార్య సినిమాల్లోకి రాబోతుందా… మిహికా బజాజ్ క్లారిటీ ఇదే..!
Miheeka Bajaj | టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్యగా మిహికా బజాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇంటీరియర్ డిజైనర్‌గా, బిజినెస్ వుమన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిహికా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించింది. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది.
Miheeka Bajaj | టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భార్యగా మిహికా బజాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇంటీరియర్ డిజైనర్‌గా, బిజినెస్ వుమన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిహికా, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించింది. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటుంది. అయితే ఇటీవల మిహికా బజాజ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓటీటీ షోల్లో పాల్గొనడం, సెలబ్రిటీలతో రెగ్యులర్‌గా కనిపించడం, వివిధ ఈవెంట్స్‌లో హాజరవ్వడం వంటి కారణాలతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.
ఇటీవల ఓ ఆర్ట్ కార్యక్రమంలో పాల్గొన్న మిహికా బజాజ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. మీడియాతో మాట్లాడిన ఆమె, “నేను సినిమాల్లోకి రాను. సినిమాలపై, నటీనటులపై నాకు చాలా గౌరవం ఉంది. కానీ నటన అనేది ప్రత్యేకమైన ప్రతిభ. అది తెలిసిన వాళ్లు మాత్రమే చేయాలి” అని తెలిపింది. ఒకవేళ సినిమా రంగంలో పని చేసే అవకాశం వస్తే, నేను కెమెరా ముందు కాకుండా వెనుక పనిచేయడానికే ఇష్టపడతాను. డిజైనింగ్ రంగంలో నా ట్యాలెంట్‌ను చూపిస్తాను అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
మిహికా వ్యాఖ్యలతో ఆమె సినిమాల్లో హీరోయిన్గా కనిపించే అవకాశం లేదని క్లారిటీ వచ్చింది. అయితే భవిష్యత్తులో ఆర్ట్ డిపార్ట్మెంట్ లేదా ప్రొడక్షన్ వంటి విభాగాల్లో పనిచేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన మిహికా బజాజ్, తన దృష్టి పూర్తిగా తన కెరీర్ మరియు వ్యాపారాలపైనే ఉందని స్పష్టం చేసింది. ఇక రానా విషయానికి వస్తే ప్రస్తుతం హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో మెరుస్తున్నాడు. ఈ మధ్య రానా నుండి ఆశిందగ్గ సినిమాలు రాలేదు. మంచి హిట్ కోసం భళ్లాలదేవుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

