వాల్తేరు వీరయ్యగా ఇప్పటికే థియేటర్లలో తన హవా చూపిస్తున్నాడు టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఈ స్టార్ హీరో ప్రస్తుతం మెహర్‌రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ (Bhola Shankar) చేస్తున్నాడని తెలిసిందే. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్‌లో చిరంజీవి సోదరిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని పెద్దమ్మ టెంపుల్లో ఇవాళ భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో మెహర్ రమేశ్ ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఈ చిత్రంలో తమన్నా భాటియా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం భోళాశంకర్ ఈ ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. విడుదల వాయిదా పడే అవకాశాలున్నట్టు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు చిరు. భోళా శంకర్ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.