Megha Aakash | టాక్ ఆఫ్ ది టౌన్‌గా మేఘా ఆకాశ్ ట్రాక్ రికార్డ్.. !
Megha Aakash | సినీ పరిశ్రమలో కొందరు యాక్లర్లకు 100 శాతం సక్సెస్ రేట్ ఉంటే.. మరికొందరేమో 100 శాతం ఫ్లాప్ రేటు కూడా ఉన్నవాళ్లున్నారు. అయితే చెన్నై సోయగం మేఘా ఆకాశ్ (Megha Aakash) రెండో జాబితాలో చేరిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Megha Aakash | సినీ పరిశ్రమలో సాధారణంగా ఏ నటీనటులకైనా హిట్టు, ఫ్లాప్ సర్వసాధారణమైన విషయమే. కొందరు యాక్లర్లకు 100 శాతం సక్సెస్ రేట్ ఉంటే.. మరికొందరేమో 100 శాతం ఫ్లాప్ రేటు కూడా ఉన్నవాళ్లున్నారు. అయితే చెన్నై సోయగంమేఘా ఆకాశ్ (Megha Aakash) రెండో జాబితాలో చేరిపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ భామ ఇప్పటివరకు ఏడు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోవడమే ఇందుకు కారణమని జోరుగా చర్చ నడుస్తోంది.
2017లో నితిన్‌తో కలిసి లై సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది. ఇది బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఆ తర్వాత ఛల్ మోహన రంగ, రాజ రాజ చోర, డియర్ మేఘ, గుర్తుందా సీతాకాలం, ప్రేమదేశం సినిమాల్లో నటించింది. వీటిలో శ్రీవిష్ణుతో కలిసి నటించిన రాజ రాజ చోర (Raja Raja Chora) సినిమాకు మాత్రం మంచి స్పందన వచ్చింది. అయితే కలెక్షన్ల విషయంలో యావరేజ్ స్థాయిలో మిగిలిపోయింది. కాగా మేఘా ఆకాశ్ ఇటీవలే రవితేజ నటించిన రావణాసుర చిత్రంలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది.
మేఘా ఆకాశ్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకోగా.. ఊహించని రీతిలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయితే అందం, అభినయం ఉంటే చాలు.. సక్సెస్, ఫెయిల్యూర్స్ది ఏముంది అన్నట్టుగా.. మేఘా ఆకాశ్‌కు మాత్రం ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. మేఘా ఆకాశ్ ప్రస్తుతం మను చరిత్ర (Manu Charithra) సినిమాతోపాటు టైటిల్ ఫిక్స్ కానీ మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఈ సారైనా మేఘా ఆకాశ్ మంచి హిట్టును అందుకుంటుందా..? లేదా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also :
SAINDHAV | వెంకటేశ్ సైంధవ్ మిషన్‌లో రేణు ఎవరు..? సస్పెన్స్ తో నయా అప్డేట్
OG | ఓజీ సెట్స్‌లో పవన్ కల్యాణ్.. స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్ ఖుషీ
Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

