మెగాస్టార్ ‘మెగావర్స్’ టాక్‌షో
దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘మెగావర్స్' టాక్ షో ద్వారా ఆయన డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు.
దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో వెండితెరపై కోట్లాదిమంది ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అరంగేట్రంతో మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘మెగావర్స్’ టాక్ షో ద్వారా ఆయన డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. నిజానికి ఈ వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినపడుతూనేవున్నది. అయితే.. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్క్రీమింగ్ కానున్న ఈ ప్రత్యేకమైన టాక్ షోలో తనదైన చరిష్మా, హాస్యం, విభిన్నమైన ఆలోచనా విధానంతో మెగాస్టార్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఆసక్తికరమైన సంభాషణలు, అద్భుతమైన కథలు, ఎన్నో కొత్త విషయాల సమాహారంగా ఈ షో సాగనున్నదని మేకర్స్ తెలిపారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విభిన్న తరాలకు చెందిన తారలతో ఈ టాక్ షోలో చిరంజీవి ముచ్చటించనున్నారు.
ఈ షో ద్వారా ప్రేక్షకాభిమానం చూరగొన్న దిగ్గజాల జీవితాలు, వారి ప్రయాణంలోని ఆసక్తికరమైన అంశాలు మరింత సన్నిహితంగా పరిచయం కానున్నాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, ఎస్‌వోఎల్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది. ఈ షోకు చెందిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

