Chiranjeevi In Peddi Sets | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా ఈ మూవీ షూటింగ్ బీటీఎస్కి సంబంధించిన వీడియో చిత్రబృందం తాజాగా పంచుకుంది.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సెట్స్‌కు విచ్చేసి చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపరిచారు. అక్కడ జరుగుతున్న షూటింగ్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించిన ఆయన, రామ్ చరణ్ లుక్ మరియు దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ విధానాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి యూనిట్ సభ్యులతో సరదాగా గడుపుతూ, సినిమా అవుట్‌పుట్ పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా చిత్ర బృందానికి తన ఆశీస్సులు అందించారు. ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన వీడియోను దర్శకుడు బుచ్చిబాబు సానా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ, మెగాస్టార్ రాక తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని భావోద్వేగంగా పేర్కొన్నారు. 1970-80ల కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో, కుస్తీ క్రీడ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పెద్ది పెహిల్వాన్’ గ్లింప్స్‌కు మెగాస్టార్ ఫిదా అయ్యారని తెలియడంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.