Megastar Chiranjeevi | టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, నటుడు శ్రీకాంత్లా సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘శంకర్ దాదా జిందాబాద్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అందులో చిరంజీవి శంకర్ దాదా పాత్ర పోషించగా, ఏటీఎమ్ పాత్రలో శ్రీకాంత్ కామెడీ పండించారు. ఇక ఈ సినిమా అనంతరం వీరిద్దరి రిలేషన్ మరింత పెరిగింది. ముఖ్యంగా శ్రీకాంత్ ఇంట్లో ఏ ఈవెంట్ ఉన్న చిరంజీవిని పక్కా పిలుస్తుంటాడు.
అయితే శనివారం శ్రీకాంత్ పుట్టినరోజు. ఇక తమ్ముడి బర్త్ డే గుర్తుపెట్టుకున్న మెగాస్టార్ ఈ సందర్భంగా నేరుగా శ్రీకాంత్ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే శ్రీకాంత్ ఇంటికి వెళ్ళేటప్పుడే కేక్ తీసుకోని మరి వెళ్ళడు చిరు. ఇక శ్రీకాంత్తో కేక్ కట్ చేయించి తినిపించాడు. అయితే ఈ కేక్ మీదా హ్యాపీ బర్త్డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని చిరు రాయించడం హైలైట్గా మారింది. ఈ వేడుక అనంతరం శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. కాగా దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
The Dada-ATM combo was clicked as the Mega Star @KChiruTweets visited @actorsrikanth ‘s home to celebrate the actor’s birthday! 😍😍#Chiranjeevi #MegastarChiranjeevi #ActorSrikanth #RoshanMeka pic.twitter.com/mk7YNRhDOX
— BA Raju’s Team (@baraju_SuperHit) March 23, 2024