Peddi Trailer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్రం మే 18న విడుదల కాబోతున్న ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ముందే వీక్షించారు. ట్రైలర్ చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
ట్రైలర్ గురించి చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే పెద్ది ట్రైలర్ చూశాను, జస్ట్ వావ్ అంతే! 3 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ ప్యూర్ పవర్ ప్యాక్డ్గా ఉంది. చరణ్, బుచ్చిబాబు, రెహమాన్.. ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. అందరూ కలిసి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేశారు. ఈ సినిమా గురించి మనం ఎంత ఊహించుకున్నా, ఈ ట్రైలర్ దాన్ని మించి ఉంటుంది. ఇందులో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అని చిరు కొనియాడారు.
ఎప్పటికప్పుడు తన సినిమాలకు లేదా చరణ్ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను లీక్ చేస్తూ అభిమానులను అలరించే చిరంజీవి, ఈసారి కూడా తన అలవాటును రిపీట్ చేశారు. “చాలా రోజులయ్యింది మీకు ‘చిరు లీక్స్’ ఇచ్చి” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ, పెద్ది ట్రైలర్‌లోని ఒక పవర్ఫుల్ డైలాగ్‌ను ఆయన లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు.. అంటూ ట్రైలర్‌లోని ఈ డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉందంటూ మెగాస్టార్ ప్రశంసించారు. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబుకు క్షమాపణలు చెబుతూ.. “సారీ బుచ్చిబాబు.. ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పి లీక్ చేయాల్సి వచ్చింది” అంటూ చిరంజీవి చమత్కరించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం యొక్క ట్రైలర్ మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ స్వయంగా ఇచ్చిన ఈ రివ్యూతో మెగా అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో ‘పెద్ది’ ట్రైలర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
#PeddiTrailer చూసాను!! 🔥
Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…
PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…
ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.
Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026