చిరంజీవి Vs అల్లు అర్జున్ | కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలు దాదాపు 20 వరకు విడుదల తేదీ కోసం వేచి చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో సోలో రిలీజ్ డేట్ దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు. అందుకే రాబోయే ఆరు నెలల వరకు తమ సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయో పెద్ద నిర్మాతలు ఇప్పటికే ఖర్చీఫ్ వేసుకొని ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ దరిదాపుల్లోకి మిగిలిన సినిమాలు రాకూడదు అంటూ రహస్య ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకే రోజు రెండు సినిమాలు విడుదలైతే.. కచ్చితంగా ఇద్దరు నిర్మాతలు నష్టపోతారు. అందుకే ఒక సినిమా వచ్చిన తర్వాత కనీసం వారం రోజుల గ్యాప్ తీసుకుని మరో సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప బాక్సాఫీస్ దగ్గర ఒకేసారి పోటీ పడబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా బ్రేకులు లేకుండా జరుగుతుంది. డిసెంబర్ 17న తొలి భాగం విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి అల్లు అర్జున్, సుకుమార్ ఈ తేదీని ఎంచుకున్నారు.
మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాను కూడా ఇదే సీజన్లో విడుదల చేయాలని చూస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. నిజానికి డిసెంబర్ 17న ఆచార్య సినిమా విడుదల చేయాలని చిరంజీవి అనుకున్నాడని వార్తలు వచ్చాయి. కేజీఎఫ్ సినిమా వాయిదా పడటంతో ఆచార్యను అదే సమయంలో విడుదల చేయాలని చిరంజీవి భావించాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అదే సమయంలో వస్తున్నాడు. దాంతో ఆచార్య మేకర్స్ ఆలోచనలో పడిపోయారు. పుష్పతో బాక్సాఫీస్ ఫైట్‌కి వెళ్లాలా.. లేదంటే వారం రోజులు గ్యాప్ ఇచ్చి 25న క్రిస్మస్ రోజు విడుదల చేయాలా అనేది ఆచార్య నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఏం జరిగినా మామ అల్లుళ్ల మధ్య బాక్సాఫీస్ వార్ మాత్రం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bheemla nayak | పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో నిత్యా మీనన్ ఎలా ఉందో చూశారా!
Rajeev kanakala | రాజీవ్ కానకాల అక్కడికి కానీ వెళ్తే రాళ్లు, చెప్పులతో కొడతారంట..
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
సమంతకు అసలు పరీక్ష ఇప్పట్నుంచే మొదలు కానుందా..?
Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?
Maa Elections | ఈవీఎంలపై నమ్మకం లేదని లేఖ రాసిన మంచు విష్ణు
chiranjeevi vs allu arjun