సమంతకు అసలు పరీక్ష ఇప్పట్నుంచే మొదలు కానుందా..?

Samantha Naga Chaitanya Divorce | సమంత, నాగ చైతన్య విడాకుల విషయం జరిగి మూడు రోజులు అయిపోతుంది. అయినా కూడా ఇప్పటి వరకు అభిమానులు దాని మీదే ఆరా తీస్తున్నారు. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.. ఏం జరుగుతుంది అనే విషయంపై ఎవరికి వారు తమకు నచ్చింది ఊహించేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ చైతూతో విడాకుల తర్వాత సమంత తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనే అనే విషయం కూడా ఇప్పుడు టాలీవుడ్ ( tollywood )లో ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈ విడాకులతో నాగ చైతన్యకు ప్రత్యేకంగా పోయేది ఏమీ లేదు. సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతాడు. పైగా లవ్ స్టోరీ సినిమాతో తాజాగా హిట్ కూడా కొట్టాడు. కానీ ఇక్కడ అసలు సమస్య సమంత దగ్గర వచ్చింది.

ఏ ఇండస్ట్రీ అయినా సరే హీరోలకు ఉండే వెసులుబాటు హీరోయిన్లకు ఉండదు. వాళ్ల కెరీర్ స్పాన్ చాలా చిన్నది. ఏం చేయాలన్నా ఆ టైంలోనే చేయాలి.. లేదంటే లేదు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఇప్పుడు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కినేని కోడలుగా మారిన తర్వాత తెలుగులో ఎక్కువగా సినిమాలు చేయలేదు సమంత. అలాగని మిగతా భాషల్లో కూడా ఎక్కువగా నటించలేదు. ఆడపాదడపా సినిమాలతోనే ఆమె కెరీర్ ముందుకు సాగింది. మరీ ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఫోకస్ చేసింది. కానీ ఇవన్నీ నాగ చైతన్య భార్యగా.. అక్కినేని కోడలుగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు. కానీ ఇప్పుడు చైసామ్ విడాకులు తీసుకుని ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇలాంటి సమయంలో సమంత ఎలాంటి సినిమాలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని మీద క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అసలు తెలుగు ఇండస్ట్రీలో సమంతకు మునపటిలా అవకాశాలు వస్తాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే సమంత ఇప్పటికే సీనియర్లు మినహా స్టార్ హీరోలు అందరితో చేసింది. ఇలాంటి సమయంలో వాళ్లు సమంతకు మళ్లీ పిలిచి అవకాశాలు ఇస్తారా లేదా అనేది చెప్పలేం. అందుకే టాలీవుడ్ ( tollywood )లో అవకాశాలు వచ్చినా రాకపోయినా మిగిలిన ఇండస్ట్రీలపై ఫోకస్ చేయాలని గట్టిగా ఫిక్సయింది సమంత. ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..
నాగ చైతన్య, సమంత నుంచి ఫ్యాన్స్ కోరుకునే చివరి కోరిక ఇదే కావచ్చు..
samantha: సమంత- నాగ చైతన్య విడాకులపై సామ్ ఫాదర్ స్పందన ఇదే..!
విద్యుల్లేఖని విడాకులెప్పుడని అడుగుతున్న నెటిజన్స్.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన కమెడీయన్
Maa elections | మా ఎన్నికలపై ఆ స్టార్ హీరోల అసంతృప్తి.. ఓటు వేయరా..?
Bheemla nayak | పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో నిత్యా మీనన్ ఎలా ఉందో చూశారా!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

