శ్రీకల్యాణ్, శశి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెగా పవర్’. గేదెల రవిచంద్ర దర్శకుడు. సత్య ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల దర్శకులు మెహర్ రమేష్, కె.ఎస్.రవీంద్ర (బాబీ) విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘రామ్‌చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ చిత్రమిది. కథలో కొత్తదనం మెప్పిస్తుంది. ప్రస్తుతం తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నది. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమవుతుంది’ అన్నారు.