Mega Movies | బాక్సాఫీస్‌పై మెగా ఎటాక్.. నెల రోజుల గ్యాప్‌లో నాలుగు సినిమాలు
Mega Hero's Back To Back Movies | ఈ ఏడాది ఆరంభంలోనే మెగా అభిమానులకు వాల్తేరు వీరయ్య రూపంలో మర్చిపోలేని హిట్టు పడింది. దాదాపు రెండొందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
Mega Hero’s Back To Back Movies | ఈ ఏడాది ఆరంభంలోనే మెగా అభిమానులకు వాల్తేరు వీరయ్య రూపంలో మర్చిపోలేని హిట్టు పడింది. దాదాపు రెండొందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఇక మూడు నెలలు తిరిగకుండానే మెగా మేనల్లుడు సాయిధరమ్ విరూపాక్షతో వచ్చి మరో వంద కోట్లు కొల్లగొట్టాడు. ఆ టైమ్‌లో మెగా అభిమానులు సందడి మాములుగా లేదు. ఇక ఇప్పుడు మెగా అభిమానులు ఉక్కిరి బిక్కిరయ్యే సమయం దగ్గరికొచ్చింది. జూన్ చివరివారం నుంచి నాలుగు వారాల పాటు మెగా జాతర షురూ కానుంది.
నెల రోజుల వ్యవధిలో బాక్సాఫీస్‌పై మెగా దాడి జరగబొతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు గురు మెగా హీరోలు నాలుగు వారాల పాటు సందడి చేయబోతున్నారు. మెగా హీరోల్లో ముందుగా వస్తుంది మామ అల్లుళ్ల బ్రో సినిమానే. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో తిరుగులేని అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు వీర లెవల్లో అంచానాలు క్రియేట్ చేశాయి. పేరుకు రీమేక్ సినిమానే అయినా.. తెలుగు నెటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ మేజర్ మార్పులు చేశాడని ఇన్సైడ్ టాక్
ఆ తర్వాత రెండు వారాలకు చిరు భోళా శంకర్‌తో వస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో బంపర్ హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. మొన్నటి వరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ ఏర్పడలేదు కానీ.. ఇటీవలే రిలీజైన టీజర్ కాస్త అంచనాలు పెంచింది. పైగా సోలోగా వస్తున్న సినిమా కావడంతో కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన మళ్లీ బాస్ రేంజ్ హిట్టు పడుతుంది. ఇక భోళా శంకర్ జోరు ముగిసేలోపే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆది కేశవ సినిమాతో వస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది.
ఈ సినిమా ఆగస్టు 18న థియేటర్లో సందడి చేయనుంది. సితారా ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థల నుంచి వస్తున్న సినిమా కావడంతో జనాల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆగస్టు చివరి వారంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున సినిమాతో వస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్లో కాస్ట్లీయెస్ట్ సినిమా ఇదే. ఈ మధ్య వరుస ఫ్లాపులతో కాస్త జోరు తగ్గించిన వరుణ్.. ఈ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇస్తాడని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. పైగా ఈ సినిమా ప్రోమో వీడియోలు మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

