Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ట్ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి కాగా, అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందుతోన్న మెగా 157 చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.అయితే వీటి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ఒక సినిమాకు సంబంధించిన అప్డేట్కు చిరంజీవి స్వయంగా టైమ్ ఫిక్స్ చేశారు. ‘విశ్వంభర’ సినిమా గురించి చిరంజీవి స్వయంగా ట్వీట్ చేస్తూ ఆగస్టు 21 ఉదయం 9:09కి ఓ ముఖ్యమైన అప్డేట్ వస్తుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది.
చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా విడుదల తేదీకి సంబంధించిన మెగా అప్డేట్ రావడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. చిరు సినిమాలకు సంబంధించి అధికారిక అప్డేట్స్ అందించేందుకు టీమ్ మెగాస్టార్ అనే ప్రత్యేక ట్విట్టర్ ఖాతా కూడా ప్రారంభించారు. ఇందులో ‘విశ్వంభర’ సినిమా వివరాలను పంచుకుంటారు. దర్శకుడు వశిష్ట కూడా ‘‘మెగా బ్లాస్ట్ రాబోతోంది’’ అంటూ పోస్ట్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను 2025 జనవరిలో విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, ఆలస్యం జరిగింది. సమ్మర్, దసరా రిలీజ్ టార్గెట్ అని వార్తలు వచ్చినా, తాజాగా 2026 ఏప్రిల్ నెలకు విడుదల వాయిదా పడే అవకాశం ఉందని టాక్.
వీఎఫ్ఎక్స్ పనుల విషయంలో సంతృప్తి చెందాకే మూవీని రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తుంది. మరోవైపు ‘మెగా 157’ సినిమా టైటిల్ గ్లింప్స్ కోసం కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్పెషల్ వాయిస్ ఓవర్‌తో టైటిల్ వీడియో రాబోతుందని టాక్. ఈ సినిమాకు ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ టాక్ షోలో దర్శకుడు అనిల్ రావిపూడి దీనిపై కొంత క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు.. మొత్తానికి చిరు బర్త్ డే ముందు రోజే ఈ అప్డేట్స్ రావడంతో అభిమానులు సెలబ్రేషన్స్ మొదలెట్టేశారు.