Mega 158 | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన లైన్లో ఉన్న అత్యంత ఆసక్తికర చిత్రాల్లో ఒకటి దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. చిరు జన్మదినం సందర్భంగా ఈ సినిమాను ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ నెలకొంది. ‘వాల్తేరు వీరయ్య’ విజయానంతరం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మరో సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ “బ్లడీ బెంచ్‌మార్క్ సెట్ చేసిన బ్లేడ్” అనే ట్యాగ్‌లైన్‌తో మెగా మాస్ హిస్టీరియాను పెంచింది. రక్తంతో తడిసిన చిలుక ఆకారం, గొడ్డలి డిజైన్ చూసి ఇది రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామా అని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో కూడా కీలక పాత్రలో నటించబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ సినిమాలో భాగమవుతున్నాడని తమిళ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కేవలం గెస్ట్ రోల్ కాదు, ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ క్యారెక్టర్ అని టాక్. చిరు – కార్తీ స్క్రీన్ షేర్ చేస్తారన్న ఈ వార్త మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. గతంలో నాగార్జునతో కలిసి ఊపిరి చిత్రంలో నటించిన కార్తీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు చిరుతో కలిసి నటిస్తే అది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
‘చిరు–బాబీ 2’ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ యాక్టర్-డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.సంగీతాన్ని ఎస్. థమన్ అందించనున్నారు. ఇటీవలే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘మెగా 158’ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేసేలా షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల జాబితా అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మెగాస్టార్ మాస్ యాక్షన్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించేందుకు సిద్ధమయ్యారు.