టాలీవుడ్ స్టార్ హీరో నాని సోదరి దీప్తి ఘంట డైరెక్షన్లో అంథాలజీ ప్రాజెక్టుగా వస్తోన్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). రుహానీశర్మ, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సత్యరాజ్ (Satyaraj), రోహిణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్.
‘ప్రేమలో చట్టం..కానీ ఎలా.. రేపు ఈ క్యూటీస్ను కలవండి..’అంటూ మీట్ క్యూట్ చిత్ర ట్రైలర్ 24 గంటల్లో రాబోతుందని స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అయితే ట్రైలర్‌ను ఏ టైంలో లాంచ్ చేస్తారనేది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రానికి బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మీట్ క్యూట్ సినిమాకు విజయ్ బల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్ నేనితో కలిసి తెరకెక్కిస్తున్నాడు నాని. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్లో వస్తున్న దసరా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది దసరా.
In Law in Love! But how?
Meet these cuties tomorrow! #MeetCute trailer out in 24 Hours!@mail2ganta @NameisNani @tprashantii @i_amak @VarshaBollamma @iRuhaniSharma @aakanksha_s30 @Rohinimolleti @iam_shiva9696 @adah_sharma @PoonachaSancho @TheSunainaa @padmasoorya pic.twitter.com/mskhooW1Yz— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 17, 2022
Read Also :Driver Jamuna | డ్రైవర్ జమున విడుదల వాయిదా.. ఇంతకీ కారణమేంటో?