Meet Cute Movie Teaser | నేచురల్ స్టార్ నాని హీరోగా ఎంత సక్సెస్ అయ్యాడో.. ప్రొడ్యూసర్‌గా కూడా అంతే సక్సెస్ అయ్యాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ.. కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన నిర్మించిన ‘ఆ!’, ‘హిట్’ చిత్రాలు నానికి ప్రొడ్యూసర్‌గా లాభాలతో పాటు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం నాని నిర్మించిన ‘మీట్‌క్యూట్’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నాని సోదరి దీప్తి ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. గతంలో ఈమె ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కించింది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మీట్క్యూట్తో ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా మెగాఫోన్ పట్టింది. ఇటీవలే నాని రిలీజ్ చేసిన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
ఐదు భిన్న కథల ఆంథాలజీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఐదు మీటింగ్స్‌లో పరిచయం లేని ఇద్దరిద్దరు వ్యక్తులు అనుకోకుండా కలుసుకొని తమ తమ అభిప్రాయాలు, వ్యక్తిత్వాల గురించి తెలుసుకున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఐదు ఎపిసోడ్స్‌గా ఈ చిత్రం ఉండనుంది. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలివ్‌లో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రుహాని శర్మ, ఆకాంక్షసింగ్, ఆదా శర్మ, వర్షబొల్లమ్మ, సునైనావంటి కథానాయికలు నటించారు. కీలకపాత్రల్లో సత్యరాజ్, రోహిణి కనిపించనున్నారు.
You meeting these characters in these 5 stories will be the best Meet Cute moment this year :)♥️#MeetCute Teaser is here 👇🏼https://t.co/mUfMwNjCV6 pic.twitter.com/zdhNi9xdNA
— Nani (@NameisNani) November 12, 2022