Rajasekhar | నారి నారి నడుమ మురారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్’ (Biker). ఈ చిత్రం నుంచి తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ వెలువడింది. ఈ చిత్రంలో సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తుండగా, ఆయన బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం మూవీ నుంచి స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రాజశేఖర్ ‘బుల్లెట్ సునీల్’ అనే బైక్ రేసర్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడు. విడుదలైన టీజర్లో బుల్లెట్ సునీల్ రికార్డ్స్ గురించి అతడి కెరీర్ గురించి ఎలివేషన్ ఇవ్వడం ఆసక్తికరంగా సాగింది.
అభిలాష్ రెడ్డి కంకరా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్‌గా కనిపిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో శర్వానంద్, రాజశేఖర్ మధ్య వచ్చే సీక్వెన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చాలా కాలం తర్వాత రాజశేఖర్ ఒక విభిన్నమైన రోల్లో మెరవనుండటంతో అతడి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.