Meera jasmine re-entry | ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు ఒక్కసారిగా సినిమాలలో కనిపించకుండా పోతారు. కొందరు అవకాశాలు రాక వెళ్లిపోతే, మరి కొందరు పెళ్లి చేసుకొని సినీరంగానికి గుడ్ బై చెప్పేస్తుంటారు. తిరిగి కొన్నేళ్లకు మంచి పాత్ర దొరికితే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే విజయశాంతి, సంగీత, సిమ్రాన్,రాశి, మీనా,భూమిక ఇలా పలువురు హీరోయిన్లు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదే బాటలోకి వస్తానంటున్న మరో హీరోయిన్ మీరాజాస్మిన్.
‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీరాజాస్మిన్ రెండవ సినిమాతోనే పవన్‌కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం మీరాజాస్మిన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. తర్వాత ‘భద్ర’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్‌ను సాధించి అప్పుడున్న హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. కానీ ఆ హిట్ స్టేటస్ ఎక్కువ కాలం నిలువలేదు. భద్ర తరువాత వరుసగా ఫ్లాపులు రావడంతో ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇక అప్పుడే అనీల్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లిచేసుకుని కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టింది. వివాహం తర్వాత కొన్నేళ్లకు విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంది.
మీరాజాస్మిన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ నేటీ హీరోయిన్లకు నేనేమి తక్కువ కానంటూ గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఈమెకు భద్ర వంటి హిట్ స్టేటస్‌ను ఇచ్చిన బోయపాటి శ్రీను తననెక్స్ట్ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. బోయపాటి ప్రస్తుతం రామ్ పోతినేనితో సినిమాను చెయబోతున్నాడు. ఇందులో రామ్‌కు అక్క పాత్రకోసం మీరాజాస్మిన్‌ను సంప్రదించాడట. తను కూడా ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. ఇదే నిజమైతే మీరాజాస్మిన్ రామ్ చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అఖండ సక్సెస్‌తో జోరుమీదున్న బోయపాటి తన తదుపరి సినిమాను అదే స్పీడ్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నాడట.ఇప్పటికే మీరాజాస్మిన్ మలయాళంలో ‘మకల్’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.