Maruthi | ప్రభాస్ సినిమా హౌజ్ సెట్లో మారుతి.. వింటేజ్ లుక్‌తో క్యూరియాసిటీ
ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం మారుతి (Maruthi) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం ప్రభాస్ కొత్త డేట్స్ ఇచ్చాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. దీన్ని నిజం చేస్తూ లొకేషన్ లో దిగిన ఓ స్టిల్‌ను మారుతి ఆన్లైన్లో లీక్ చేశాడు.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం మారుతి (Maruthi) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్ (Malavika Mohanan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతున్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం ప్రభాస్ కొత్త డేట్స్ ఇచ్చాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. 3 రోజులపాటు సాగే ఈ సినిమా తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్టు ఇప్పటికే అప్డేట్ బయటకు వచ్చింది.
దీన్ని నిజం చేస్తూ లొకేషన్ లో దిగిన ఓ స్టిల్‌ను మారుతి ఆన్లైన్లో లీక్ చేశాడు. చీకట్లో వింటేజ్ లుక్ హౌజ్ సెట్లో అందమైన లైట్ల మధ్య తీసిన ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు మారుతి. ఈ టాలీవుడ్ డైరెక్టర్ మొత్తానికి ప్రభాస్ సినిమా ఈ సారి డిఫరెంట్ ఫ్లేవర్‌లో ఉండబోతుందని తెలియజేస్తూ.. మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాడు మారుతి.
ఈ షెడ్యూల్లో ప్రభాస్, మాళవిక మోహనన్ పై వచ్చే కీలక సన్నివేశాలను మారుతి టీం చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో ప్రభాస్ కాల్షీట్లకు అనుగుణంగా షూటింగ్‌కు ప్లాన్ చేశాడట మారుతి. ప్రస్తుతం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్-Kలో నటిస్తున్నాడు ప్రభాస్. దీంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
హౌజ్ సెట్లో మారుతి ఇలా..
Read Also :
Vennela Kishore | ఇండియన్ 2లో వెన్నెల కిశోర్ నెగెటివ్ రోల్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?
Mangalavaaram | సస్పెన్స్ గా అజయ్ భూపతి మంగళవారం టైటిల్ లుక్
Bichagadu 2 | శాకుంతలం వర్సెస్ బిచ్చగాడు 2.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ఫైట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

