వినోదాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ మారుతి (Maruthi). ఓ వైపు వినోదం అందిస్తూనే..మరోవైపు ఏదో ఒక సందేశాన్ని కూడా ఇచ్చేలా చూసుకుంటాడు. ఈ టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ తెరకెక్కించిన మంచి రోజులు వచ్చాయి నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా దీపావళి సందర్బంగా తన ఫాలోవర్లు, సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు మారుతి. తాను ఇటీవలే ఓ కథను చిరంజీవి (Chiranjeevi) కి వినిపించినట్టు చెప్పాడు. అంతేకాదు తన కథకు ఇంప్రెస్ అయిన చిరంజీవి పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేయాలని సూచించినట్టు మారుతి వెల్లడించాడు.
ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రంలో చిరంజీవిలోని కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్గా వాడుకోబోతున్నాడట మారుతి. ఆసక్తికర విషయమేంటంటే త్వరలోనే ఈ ప్రాజెక్టును లాంఛ్ కూడా చేయబోతుండటం. ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆచార్యతోపాటు భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో మరో సినిమా చిరు ఖాతాలో ఉన్నాయి.
ఓ వైపు నాలుగు చిత్రాలు లైన్లో ఉండగానే..మారుతి సినిమాకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడన్న వార్తతో ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు మెగా అభిమానులు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?