Mark Antony Movie | ఈ మధ్య కాలంలో ఒక ట్రైలర్ వల్ల సినిమాపై ఊహించని రేంజ్లో హైప్ వచ్చిందంటే అది మార్క్ ఆంటోని సినిమాకే. ట్రైలర్ ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ ట్రైలర్ రిలీజయ్యాక తిరుగులేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఎంతంటే డబ్బింగ్ రైట్స్ కోసం నిర్మాతలు/ డిస్ట్రిబ్యూటర్లు కోట్లకు కోట్లు ఆఫర్ చేసేంతలా. నిజానికి చాలా కాలం తర్వాత విశాల్ సినిమా కోసం జనాలు అమితాసక్తితో ఉన్నారు. అప్పుడెప్పుడో ఐదేళ్ల కిందట అభిమన్యుడు అనే సినిమా తెలుగు ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత విశాల్‌కు తెలుగులో హిట్టే లేదు. ఇక మరో వారం మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న మార్క్ ఆంటోని సినిమాపై జనాల్లో మంచి బజ్ ఉంది.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేస్తూ సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త చెన్నై మీడియాల్లో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా కోసం ఏకంగా ఐదు స్టంట్ మాస్టర్లు పని చేశారు. ఈ సినిమాలో కీలకమైన ఐదు యాక్షన్ ఎపిసోడ్లో ఐదుగురు స్టంట్ మాస్టర్లు డిజైన్ చేశారు. వీరభద్ర స్వామి అంటూ సాగే పాటలో ఓ స్పిర్చువల్ ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్‌ను దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫి చేశాడట. ఇక రెట్రో క్లబ్ ఫైట్‌ను దినేష్ సుబ్బరాయన్ డిజైన్ చేశాడు.
ఓల్డ్ వింటేజ్ ఫైట్‌ను పాపులర్ స్టంట్ మాస్టర్ కనల్ కన్నన్ రూపొందించాడట. ఇక క్లైమాక్స్ ఫైట్‌తో పాటు ఓ డబుల్ డెక్కర్లోని ఫైట్‌ను పీటర్ హేయిన్ కొరియోగ్రఫి చేశాడట. ఇక సినిమాలో చాలా ముఖ్యమైన చేజ్ సీన్‌ను మాఫియా శశి నేతృత్వంలో తెరకెక్కించాడట. ఇలా ఒక్క సినిమాకు ఐదుగురు స్టంట్ మాస్టర్లు పని చేయడం అనేది అరుదుగా జరుగుతుంది. ఈ వార్తతో సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు ఈ ఫైట్ న్యూస్ మంచి కిక్కించేలా ఉంది.
పీరియాడిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా ఇందులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేశారు. విశాల్‌కు జోడీగా ఈ సినిమాలో రీతూవర్మ, అభినయలు నటిస్తున్నారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఇక హిందీలో సెప్టెంబర్ 22న విడుదల కానుంది.
#MarkAntony Has 5 Stunt Directors👊
*Dileep Subbarayan – Karupanna Sami Spiritual Song Fight 🛠️
*Dinesh Subbarayan – Retro club Free Style Fight🪓
*Kanal Kannan – Old Vintage Fight🧨
*Peter Hein – Double Decker Running Bus
Fight & Climax Complicated Fight💣*Mafia Sasi -… pic.twitter.com/ctuvOuJeTz
— Christopher Kanagaraj (@Chrissuccess) September 12, 2023