Kalki 2 | ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12వందల కోట్ల రూపాయల వసూళ్లను సాధించి, ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి ఫ్రాంచైజీ’ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది ‘కల్కి 2898ఏడీ’. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన అప్డేట్ కోసం దేశవ్యాప్త ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ చిత్ర నిర్మాతలైన స్వప్న దత్, ప్రియాంక దత్ ‘కల్కి 2’ గురించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాట్లాడారు. ‘ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
కాకపోతే రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేదానిపై క్లారిటీ లేదు. త్వరలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తాం. నిజానికి ‘కల్కి 2898ఏడీ’తో పాటే ‘కల్కి 2’ షూటింగ్ కూడా కొంతమేర జరిగింది. దాదాపుగా 35శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. స్క్రిప్ట్‌లో ఏవన్నా బెటర్మెంట్స్ జరిగితే తప్ప దాన్ని మార్చేదేం లేదు. ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్ర పోషించిన దీపికా పదుకొణే.. పార్ట్ 2లో కూడా కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపిస్తారు. అమితాబ్, ప్రభాస్ పాత్రలు ఫస్ట్పార్ట్ని మించి ఉంటాయి. ఇంకా ఊహకందని ఎన్నో అద్బుతాలు పార్ట్ 2లో చూస్తారు.’ అంటూ చెప్పుకొచ్చారు స్వప్న దత్, ప్రియాంక దత్.