Adipurush | అనాథ చిన్నారులకు ఆదిపురుష్ స్క్రీనింగ్.. మంచు మనోజ్ కపుల్ నిర్ణయం
Adipurush | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో వస్తున్న సినిమా ఆదిపురుష్ (Adipurush). ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్న మైథలాజికల్ డ్రామా 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది.
Adipurush | పురాణేతిహాసం రామాయణం నేపథ్యంలో ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో వస్తున్న సినిమా ఆదిపురుష్ (Adipurush). మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది.
కాగా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మంచు మనోజ్ (Manoj Manchu)-భూమా మౌనిక దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. అనాథ చిన్నారులకు ఉచితంగా ఆదిపురుష్ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు మంచు మనోజ్. ప్రతీ ఒక్కరూ ఎలాంటి హద్దులు లేకుండా వేడుకగా జరుపుకునే సినిమా ఆదిపురుష్. జీవితంలో వచ్చే అరుదైన అవకాశం.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని 2500 మంది అనాథ చిన్నారులకు మైథలాజికల్ మాస్టర్ పీస్ రామాయణం ఆధారంగా వస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని జూన్ 16న చూపించాలని నిర్ణయించాం. బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్‌తో కలిసి ఈ గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు తెలియజేశాడు మనోజ్. మంచు మనోజ్-మౌనిక దంపతుల గొప్ప మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్ర పోషిస్తుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణాసురుడి (లంకేశ్)గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. హనుమంతుడి పాత్రలో దేవ్‌దత్తా నగే నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Jai Shri Ram 🙏🙏🙏#Adipurush ❤️🔥@BhumaMounika@Brihaspathitec @namastheworld#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @AAFilmsIndia @peoplemediafcy pic.twitter.com/WM1yolK0C2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 12, 2023
ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

