Mangalavaaram Movie | ఐదేళ్ల క్రితం కార్తికేయ హీరోగా వచ్చిన ‘ఆర్ఎక్స్100’ చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఎన్నో ఏళ్లుగా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న కార్తికేయకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పాయల్ రాజ్‌పుత్ (Payal Raj puth) తన బోల్డ్ నటనతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి (Ajay Bhupati) ఒక్క సారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. పల్లెటూరి నేపథ్యంలో ఒక రా, రస్టిక్ లవ్‌స్టోరీతో నిర్మాతలకు పదింతలు లాభం తెచ్చిపెట్టాడు. ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్, శర్వానంద్‌తో తెరకెక్కించిన మల్టిస్టారర్ ‘మహాసముద్రం’ తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర అల్ట్రా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇక అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం మంగళవారం (Mangalavaaram). ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ పోషిస్తుంది.
రీసెంట్గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి విడుదల తేదీని రేపు ఉదయం 10.30 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకోచ్చింది.
మంగళవారం వచ్చేస్తుంది 🦋🦋🦋🦋
Stay tuned for the Release Date Announcement Tomorrow, 10:30 AM🔥
An @DirAjayBhupathi‘s Vision 🎬
An @AJANEESHB Musical 🥁#Mangalavaaram @starlingpayal @Nanditasweta @MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM… pic.twitter.com/fwNKW7e3YL— IndiaGlitz Telugu™ (@igtelugu) September 25, 2023
నందిత శ్వేత, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల కానుంది. ఇక అజయ్ ఈ సినిమాను ముద్ర మీడియా, ఏ క్రియేటీవ్ వర్క్స్‌తో కలిసి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.